శ్రీమాతా జ్యోతిషాలయంSri Matha Jyotishalayam
తరతరాల సాంప్రదాయ జ్యోతిష విద్య — జాతక విశ్లేషణ, మేళాపకం, వాస్తు, పరిహారాలు. Traditional Vedic astrology across generations — birth chart analysis, marriage matching, Vastu and remedial rites.
స్థాపన 1973 · మంగళగిరిFounded 1973 · Mangalagiriమా గురించిAbout us
కీ.శే. పండిత బ్రహ్మశ్రీ శనగల లక్ష్మీ నరసింహ శాస్త్రి గారు జ్యోతిష విశారద, జ్యౌతిష్య మార్తాండ, జ్యౌతిష్య ద్యుమణి వంటి బిరుదులతో ప్రసిద్ధులు. పదిహేనేళ్లకు పైగా జ్యోతిష శాస్త్రంపై పరిశోధన చేసిన తర్వాత 1973లో శ్రీమాతా జ్యోతిషాలయాన్ని స్థాపించారు. 2012లో ఇది "శ్రీమాతా జ్యోతిష్య విద్యా పరిశోధన సంస్థ"గా రూపొంది, సంస్థ నమోదు సంఖ్య 245/2012 తో నమోదైంది.
The late Pandit Brahmasri Sanagala Lakshmi Narasimha Sastri, who held titles such as Jyotisha Visharada, Jyotishya Martanda and Jyotishya Dyumani, founded Sri Matha Jyotishalayam in 1973, after more than fifteen years of research in astrology. In 2012 it became "Sri Matha Jyotishya Vidya Parishodhana Samstha", registered under firm registration number 245/2012.
శనగల వంశీయులు తరతరాలుగా వైదిక, స్మార్త, జ్యౌతిష, వేదాంత, ధ్యానయోగ సేవలను అందిస్తున్నారు. ఈ వంశంలో శ్రీ దత్తాత్రేయ, శ్రీ ఆంజనేయ భక్తులు, ప్రాణ, స్వర, క్రియా యోగ సాధకులు ఉన్నారు. ప్రస్తుత తరంలో కల్యాణీగోపాల్ శనగల, కృష్ణ శాస్త్రి శనగల ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.
For generations the Sanagala family has offered Vedic, Smarta, astrological, Vedantic and meditative-yoga services, with devotees of Sri Dattatreya and Sri Hanuman and practitioners of Prana, Swara and Kriya Yoga. In the present generation, Kalyani Gopal Sanagala and Krishna Sastri Sanagala carry this lineage forward.
మా సేవలుOur services
జన్మ జాతక విశ్లేషణBirth chart analysis
జన్మ వివరాల ఆధారంగా సాంప్రదాయ సూత్రాలతో సమగ్ర జాతక పరిశీలన — దశలు, గోచారం, వర్గ చక్రాలు సహా.A thorough reading of your horoscope using traditional principles, including dashas, transits and divisional charts.
మేళాపకం (వివాహ పొంతన)Marriage matching
అష్టకూట, దక్షిణాది పొంతనలు, కుజ దోష సమతుల్యత, దశా సంధులు మొదలైన అన్ని కోణాల్లో వధూవరుల పరిశీలన.Compatibility of bride and groom through ashtakoota and southern poruthams, Kuja dosha balance, dasha periods and more.
వాస్తు సలహాVastu guidance
వాస్తు ప్రకారం గృహ నిర్మాణ ప్రణాళిక, ఉన్న గృహాల పరిశీలన, సరిదిద్దే సూచనలు.House plans in line with Vastu, review of existing homes and practical corrections.
జాతక శాంతి, నవగ్రహ పరిహారాలుJataka Shanti and Navagraha remedies
ఒక్కొక్కరికి తగిన ప్రత్యేక సంకల్పంతో పరిహార కర్మలు — వివాహం, సంతానం, ఉద్యోగం వంటి విషయాల్లో మార్గదర్శనం.Remedial rites performed with a sankalpa suited to each person, guiding matters such as marriage, children and employment.
పూర్వజన్మ విశ్లేషణPast-life analysis
పూర్వజన్మ ప్రభావాల విశ్లేషణ, దానికి తగిన పరిహారాలు.Analysis of past-life influences with remedial rites based on it.
యోగ సాధన మార్గదర్శనంYoga practice guidance
ప్రాణ, స్వర, క్రియా యోగ సాధనల్లో మార్గదర్శనం.Guidance in Prana, Swara and Kriya Yoga practices.
శ్రీమాతా జ్యోతిషాలయం యాప్The Sri Matha Jyotishalayam app
మీ జన్మ వివరాల ఆధారంగా లెక్కించిన విశ్లేషణలు, మీ ఫోన్‌లో. పండితులు ఆమోదించిన తెలుగు పాఠ్యంతో, ఆంగ్లంలో కూడా చూడవచ్చు. యాప్‌లో ప్రవేశం జ్యోతిషాలయం ఇచ్చే మొబైల్ నంబర్, యాక్సెస్ కోడ్‌తో మాత్రమే.
Analyses calculated from your own birth details, on your phone, with Telugu text reviewed by the pandits and an English view as well. Entry is only with the mobile number and access code issued by the Jyotishalayam.
సంప్రదింపుContact
ముందుగా వాట్సాప్ ద్వారా సందేశం పంపండి. జ్యోతిషాలయం వారు తమకు కుదిరిన సమయంలో మీకు ఫోన్ చేస్తారు. Please send a WhatsApp message first. The Jyotishalayam will call you back at a convenient time.
- ఫోన్Phone+91 94949 33332
- WhatsAppవాట్సాప్‌లో సందేశం పంపండిSend a WhatsApp message
- ఈమెయిల్Emailsmjvpsamstha@gmail.com
- చిరునామాAddress డోర్ నెం: 10-318/7, శ్రీనగర్ కాలనీ, ఎఱ్రబాలెం, మంగళగిరి.Door No. 10-318/7, Srinagar Colony, Errabalem, Mangalagiri.